నటి సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. అయితే, ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయిపల్లవి మాంసాహారం మానేశారని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.