మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. OTTలో ఈ సినిమా హవా కొనసాగుతోంది. సదరు సంస్థలో ఈ చిత్రం రెండు వారాలుగా టాప్ 2లో గ్లోబల్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఏకంగా 17.8 బిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. అక్టోబర్ 31న రిలీజై సూపర్ హిట్ అందుకుంది.