గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.