SRPT: రేషన్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. గంజాయి, ఇసుక రవాణా కట్టడికి సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు.