NLR: త్వరలో జరగనున్న నీటి సంఘం ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. వాటిని సరిచేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మనుబోలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సమస్యలపై ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని విమర్శించారు.