ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. రిలీజైన అన్ని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. అయితే తాజాగా ఈ మూవీ రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆరు రోజుల్లోనే వేయి కోట్లు వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.