హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించారు. 2025 సెప్టెంబరు 25న సినిమాని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.