సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ముగింపుకు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్-1లో బరోడా-బెంగాల్ తలపడ్డాయి. బరోడా కెప్టెన్‌గా కృణాల్ పాండ్యా ఉండగా అతని సోదరుడు హార్థిక్ పాండ్యా కూడా అదే జట్టులో ఆడుతున్నాడు. అయితే బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరువురు విఫలమవడం అభిమానులను నిరాశ పరిచింది. 11 బంతులు ఆడిన హార్థిక్ 10 పరుగులు చేయగా, 11 బంతులు ఆడిన కృణాల్ కేవలం 7 పరుగులే చేసి వెనుదిరిగారు.