KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగానే నిలకడగా ఉంది. మంగళవారం రూ. 7,150 పలికిన పత్తిధర ఈరోజు కూడా అంతే పలికింది. బుధవారం యార్డుకు రైతులు 22 వాహనాల్లో 185 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,150, కనిష్ఠంగా రూ.6,700 పలికింది. ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.