ట్రంప్ కుమారుడు డొనాల్డ్ జూనియర్‌తో కింబర్లీ గిల్ఫోయిల్‌కు ఇదివరకే నిశ్చితార్థం అయింది. ట్రంప్ ఆమెను గ్రీక్ రాయబారిగా నియమించారు. గతంలో ఫాక్స్‌న్యూస్ హోస్ట్‌గా పనిచేసిన కింబర్లీ.. అనంతరం పొలిటికల్ ఫండ్ రైజర్‌గా రాణించారు. గ్రీస్‌తో రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో కింబర్లీ బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పగలదని ట్రంప్ తెలిపారు.