చాలామంది డిప్రెషన్‌తో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యకు యోగాతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ చేయాలని, ప్రశాంతమైన వాతావరణంలో డైలీ కనీసం 15-20 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడైనా సరే పాజిటివ్‌గా ఆలోచించాలి. మనసుకు నచ్చిన పాటలు వినాలని, పుస్తకాలు చదవాలని పేర్కొంటున్నారు. ఏదైనా పనిలో నిమగ్నం అవ్వాలని, ఇష్టమైన వారితో తరచూ మాట్లాడాలని చెబుతున్నారు.