ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సిరాజ్-హెడ్ మధ్య చోటుచేసుకున్న వివాదంపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ స్పందిస్తూ.. సిరాజ్ అనుచిత సంబురాలపై సీనియర్లు అతడికి నచ్చచెబితే బాగుంటదని సూచించాడు. సిరాజ్ ఎంపైర్ ప్రకటన రాకముందే సంబురాలు చేసుకుంటున్నాడు. అతడు మంచి బౌలర్ అయినప్పటికీ మితిమీరిన సంబురాలు ఆటకు అంత మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.