కామారెడ్డి: ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని IDOCలో ట్రెజరీ కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఉద్యోగులు రక్తదానం చేయాలని సూచించారు. అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, టీజీవో కార్యదర్శి సాయి రెడ్డి పాల్గొన్నారు.