కర్నూలు: అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డీ.గౌస్ దేశాయ్ అన్నారు. సీపీఎం కర్నూల్ మండలం మూడో మహాసభలు గొందిపర్లలోని వసంత నగర్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు రైల్వే వ్యాగన్ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిర్మాణ పనులు ప్రారంభించి 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదన్నారు.