SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాలకు 108 నూతన వాహనాలను మంగళవారం ఎమ్మెల్యే సామేలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.