పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆడిలైడ్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. మెక్‌స్వీనీ (10), ఖవాజా (9) కేవలం 3.2 ఓవర్లలోనే 19 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. భారత్ 180 & 175 చేయగా ఆసీస్ 337 & 20 పరుగులు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. కాగా, పింక్ బాల్‌తో ఒక్క టెస్టు కూడా ఆసీస్ ఓడిపోకపోవడం గమనార్హం.