గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియా ఒక గెలుపు, మూడు ఓటములు అన్న రీతిలో ప్రదర్శన చేస్తోంది. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి గంభీర్ కోచింగ్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలో తొలి టెస్టు గెలిచిన భారత్.. రెండో టెస్టులో చేతులెత్తేసింది. దీంతో గంభీర్ కోచింగ్‌పై అనుమానాలు వస్తున్నాయి. అసలు అతడు ఏం చేస్తున్నాడంటూ క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.