జుట్టు నెరిసిపోవటం వల్ల లేదా ఫ్యాషన్ కోసం కొంతమంది హెయిర్ కలర్ వాడుతుంటారు. అయితే తరచూ జుట్టుకు రంగు వేసుకోవటం వల్ల పలు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డైస్లోని రసాయనాలు జుట్టును పొడిగా మారుస్తాయి. ఫలితంగా వెంట్రుకలు చిట్లిపోతాయి. చర్మం ఎర్రబడటం, వాపు, దురద, కంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు హెయిర్ కలర్లోని కెమికల్స్ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి.