ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం లబుషేన్ (20*), మెక్స్వినీ (38*) క్రీజులో ఉన్నారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.