»Russian Fighter Jet Collides With Us Drone Over Black Sea
Russian jet hit US drone: అమెరికా డ్రోన్ ను కూల్చేసిన రష్యా జెట్
అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది.
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది. నిన్న నల్ల సముద్రం మీదుగా యూఎస్ కు చెందిన ఎంక్యూ -9 రీపర్ డ్రోన్ ను (American MQ-9 Reaper drone) రష్యాకు చెందిన ఎస్ యూ-27 జెట్ ఫైటర్ (Russian Su-27 jet fighter) ఢీకొట్టిందని యూఎస్ మిలిటరీ యూరోపియన్ (US military’s European Command) కమాండ్ వెల్లడించింది.
‘తమ ఎంక్యూ-9 అంతర్జాతీయ గగనతలంలో సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, దానిని రష్యా సుఖోయ్ విమానాలు రెండు అడ్డగించి ఢీకొట్టాయి. ఫలితంగా ఈ డ్రోన్ క్రాష్ అయి, పూర్తిగా నష్టం జరిగింది.’ అని యూఎస్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ జేమ్స్ హెక్కెర్ తెలిపారు. రష్యన్ ఇలా చేయడం సురక్షితం కాదన్నారు. ఇలాంటి తీరును మార్చుకోవాలని హితవు పలికారు. రష్యా తీరు వల్ల రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వవలసి వచ్చిందన్నారు.
ఎంక్యూ-9 డ్రోన్ ముందు సుఖోయ్ లు పలుమార్లు ఇంధనం గుమ్మరించినట్లు తెలిపారు. తద్వారా పర్యావరణానికి హానీ కలిగిస్తోందన్నారు. దాదాపు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల సమయంలో రష్యాన్ సుఖోయ్ 27 విమానం… తమ ఎంక్యూ-9 ప్రొపెల్లర్ ను తాకిందని తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో రష్యా అడ్డుకోవడం సాధారణంగా జరిగే విషయం. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఏడాది కాలంగా ఉద్రిక్తతలను పెంచిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం అమెరికా, రష్యా మధ్య మరింత దూరాన్ని పెంచింది. ఇలాంటి సమయంలో ఈ వివాదం చోటు చేసుకున్నది.
ఈ ఘటనకు సంబంధించి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనికేషన్స్ కో-ఆర్డినేటర్ జాన్ కిర్బీ.. దేశ అధ్యక్షులు జో బిడెన్ కు వివరించారు. రష్యా తరుచూ ఇలాంటి వైఖరిని అవలంభిస్తోందని కిర్బీ ఆ తర్వాత ఆందోళన వ్యక్తం చేశారు.