KMR: సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి MPPS స్కూల్లో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి హరికిషన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో RBSK డాక్టర్ మారుతి, HM బిల్యానాయక్ పాల్గొన్నారు.