మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలిపోవటం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. గుడ్డు తెల్లసొనను కుదుళ్లకు పట్టించి ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఉల్లిరసం లేదా కలబంద గుజ్జు అప్లై చేసుకోవాలి. ఆముదం, కొబ్బరినూనె కలిపి కాస్త వేడి చేసి జుట్టుకి పట్టించాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు ఒత్తుగా, బలంగా పెరుగుతాయి.