ప్రకాశం: జిల్లా డీఈఎల్ఈడీ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ నవంబరు 2024 నకు సంబంధించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను WWW.BSE.AP.GOV.IN వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేస్తే సబ్జెక్టునకు రూ.500 లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.