నిత్యం ఆహారంలో బెండకాయను భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే బెండకాయ తింటే ఆ ప్రయోజనం పొందవచ్చు. 100 గ్రాముల బెండకాయల ద్వారా సుమారు 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా.. ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోరు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.