TPT: KVB పురం మండలం పూడి-సీకే పురంలో విషాదం చోటు చేసుకుంది. పూడి-సీకే పురం గ్రామానికి చెందిన నక్కలకోన రమేశ్ అనే పశువుల కాపరి మూర్ఛ వ్యాధి వచ్చి అడవిలో పడిపోయాడని గ్రామస్థులు తెలిపారు. కాజ్వే దాటలేక అక్కడే వైద్యం చేయడంతో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పూడి-సీకే పురం వద్ద కాజ్వే కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.