సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘మిస్ యు’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 29న రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటం, తమిళనాడులో పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఈ సినిమాని వాయిదా వేశారు.