TG: కన్నడ నటి శోభితది ఆత్మహత్యేనని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఆత్మహత్యకు ముందు ఎవరికైనా మెసేజ్ చేసిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. శోభిత పేరెంట్స్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నటనకు దూరంగా ఉండటం, అవకాశాలు లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.