TG: హైదరాబాద్‌లో పోలీసులు కార్ల దొంగలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు జూపూడి ఉషతో సహా మల్లేష్, సాగర్ పాటిల్, అనిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో కార్లను అద్దెకు తీసుకొని మహారాష్ట్ర, కర్ణాటకలో విక్రయిస్తున్నారని, రూ.2.5 కోట్ల విలువైన 21 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.