SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద నాలుగు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరో గ్లామర్, హీరో హెచ్ఎఫ్, హోండా, టీవీఎస్ ద్విచక్ర వాహనాలను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. మంటలు ఆరకపోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.