VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో నేటి నుంచి చందన దీక్షలు మొదలవనున్నాయి. నేటి నుంచి జనవరి 12వరకు మండల దీక్షలు, డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు రెండో విడత 32 రోజుల దీక్షలు చేపట్టనున్నారు. అయితే సింహాద్రి అప్పన్న మాలలు వేసుకునే భక్తులకు తులసీ మాల, స్వామి ప్రతిమ దేవస్థానం వారు ఉచితంగా ఇస్తారు.