ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా డిసెంబర్ 5న 6 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే, తెలంగాణలో రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బుకింగ్ టికెట్లు ప్రారంభం కానున్నాయి. ఏపీలో టికెట్ రేట్లపై చర్చలు పూర్తి కాలేదు. కాగా, దీనిపై రేపు క్లారిటీ రానుంది.