TG: రాష్ట్ర యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 12న ఆమెకు ఈ పోస్టింగ్ కల్పించారు. కానీ, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా స్మితా ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. ఎన్నికలు పూర్తి కావడంతో తిరిగి వచ్చిన ఆమె బాధ్యతలు స్వీకరించారు.