వయనాడ్ లోక్సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఈ మేరకు లోక్సభలో ఎంపీగా రేపు ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారు. ఆమెతోపాటు నాందేడ్ ఎంపీగా గెలిచిన రవీంద్ర వసంతరావు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.