VZM: రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం కలెక్టరేట్ ముందు కిసాన్ సంయుక్త మోర్చా సంఘాలు నిరసన తెలియజేశాయి. ఈ సందర్భంగా కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతుల పంటకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.