ELR: కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా- కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాపిత పిలుపులో భాగంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు.