ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా హేమంత్ సోరెన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులను హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా హేమంత్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.