చైనా దిగుమతులపై 10 శాతం సుంకాన్ని విధిస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాణిజ్య యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని మండిపడింది. అమెరికా-చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఇరుదేశాలకు పరస్పరం మేలు చేస్తాయని, కానీ వాణిజ్య యుద్ధానికి దిగితే మాత్రం ఎవరికీ ఉపయోగం ఉండదని అమెరికాలోని చైనా దౌత్యకార్యాలయం అధికార ప్రతినిధి లియు పెంగ్యూ వ్యాఖ్యానించారు.