AP: నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. యువతలో నైపుణ్యం పెంచే కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. స్టార్టప్లకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.