ADB: నిరుపేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం జైనథ్ మండలంలోని ఆశింపూర్, రామాయిలో పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.