SKLM: సంకల్పంతోనే విద్యార్థులు చదువుకున్న వయసులో చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో నడవగలరని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని సంకల్పం పేరిట రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాలలో మంగళవారం మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.