AP: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై పవన్ చర్చించారు. రహదారుల నిర్మాణానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ నుంచి 90 శాతం నిధులు ఇప్పించాలని కోరినట్లు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదని.. పనుల నిర్వహణకు రెండేళ్ల కాలపరిమితి పెంచాలని కోరినట్లు చెప్పారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.