W.G: 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి కలెక్టరేట్ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య దేశంలో అత్యద్భుతమైన రాజ్యాంగన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మించడం జరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించారన్నారు.