భారత రాజ్యాంగం దేశానికి జీవనాడి అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు హామీ ఇస్తుందన్నారు. దేశభక్తి గల పౌరులమైన మనమందరం.. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాలను రక్షించే గురుతరమైన పనిని కలిగి ఉన్నామన్నారు. అందువల్ల రాజ్యాంగంలోని ప్రతి ఆలోచనను రక్షించడానికి ప్రజలందరూ కలిసి రావాలని కోరారు.