ప్రకాశం: ఒంగోలులోని సాంఘిక బాలికల వసతి గృహంలో ఉన్న బాలికలకు దుప్పట్లను కలెక్టర్ తమిమ్ అన్సారీయా సోమవారం రాత్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో ఉంటున్న 7240 మంది విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.