AP: అమలాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులో త్వరలోనే మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్టు అవుతారన్నారు. వారి అవినీతిని బయట పెడతామని తెలిపారు. తాను భూకబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారు, ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.