జార్ఖండ్ అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 89 శాతం మంది కోటీశ్వరులు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.42.20 కోట్ల ఆస్తులతో రాష్ట్రంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా రామేశ్వర్ ఉరావ్(కాంగ్రెస్) నిలిచారు. 2019లో 56 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉండగా.. ఈ సారి 71 మంది ఉన్నారు. ఈ విషయం జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక వెల్లడించింది.