»Vennello Aadapilla Song Release From Bedurulanka 2012 Movie
Bedurulanka 2012: నుంచి వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ రిలీజ్
గోదావరి పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం బెదురులంక 2012(Bedurulanka 2012) నుంచి వెన్నెల్లో ఆడపిల్ల లిరికల్(Vennello Aadapilla song) వీడియో సాంగ్ విడుదలైంది. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.
డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి(Neha Sshetty), RX 100 ఫేమ్ కార్తికేయ(Kartikeya) గుమ్మకొండ నటించిన బెదురులంక 2012(Bedurulanka 2012) మూవీ(movie) నుంచి వెన్నెల్లో ఆడపిల్ల(Vennello Aadapilla song) లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ గోదావరి పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్గా కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ పాటకు లిరిక్స్ కిట్టు విస్సాప్రగడ అందించగా..హారిక నారాయణ్, జేవీ సుధాంషులు ఆలపించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ(Mani Sharma) సంగీతం సమకూర్చారు. వీడియో చూస్తే ఈ పాట సరికొత్తగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని కూడా ఈ పాటలో చక్కగా చూపించారు.
ఇక ఈ చిత్రానికి క్లాక్స్(Clax) రచన & దర్శకత్వం చేయగా.. అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్(Auto Ram Prasad) తదితరులు విభిన్న హాస్య పాత్రల్లో పోషిస్తున్నారు. అంజి, పృధ్వి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ చేస్తుండగా.. రవీంద్ర బెనర్జీ ముప్పనేని, సి.యువరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అయితే ‘బెదురులంక 2012’ చిత్రం హాస్య నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో కొనసాగే చిత్రమని తెలుస్తోంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్(Loukya Entertainments) బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.