»Womens Day Telangana Govt Declares Holiday For Women Employees On March 8
Women’s Day: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్!
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం, మార్చి 5వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం రోజున సెలవు వర్తిస్తుంది.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రారంభంలో మహిళా దినోత్సవాన్ని వేర్వేరు తేదీల్లో నిర్వహించేవారు. ఇరవయ్యే దశకం ప్రారంభంలో ఒక్కో దేశం ఒక్కో తేదీని జరుపుకునేది. ఆ తర్వాత క్రమంగా మార్చి 8న నిర్వహిస్తూ వస్తున్నారు. మహిళలకు ప్రత్యేకమైన ఈ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం, మార్చి 5వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం రోజున సెలవు వర్తిస్తుంది. ప్రయివేటు సంస్థల్లో పని చేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించింది. గత ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించాయి.
మరోవైపు, మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 8వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారు. మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి, దశలవారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మహిళలకు ప్రతి మంగళవారం ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి వైద్య సేవలు అందించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.
క్యాన్సర్ నిర్ధారణ, ఇతర డయాగ్నోస్టిక్ పరీక్షలతో పాటు మహిళల అనారోగ్య సమస్యలకు సంబంధించిన కీలకమైన ఎనిమిది రకాల వైద్య సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద ఈ పరీక్షలు అన్నీ ఉచితంగా అందిస్తారు. వీరిపై ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది. తీవ్రతర సమస్యలు ఉన్నవారిని రెఫరల్ సెంటర్లు, ప్రభుత్వ పెద్ద హాస్పిటల్స్ కు పంపిస్తారు. సంబంధిత మహిళకు పూర్తిగా బాగయ్యే వరకు వైద్యసేవలు అందిస్తారు. రిఫరల్ హాస్పిటల్స్ లో మహిళల సేవల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఉంటాయి. ఈ ప్రత్యేక సేవల గురించి మహిళా సంఘాలు, మెప్మా సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపై కూడా ఈ పథకం కింద అవగాహన కలిగిస్తారు.