GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృధికి ఎన్డీయే కూటమితోనే సాధ్యమని, దానికి కట్టుబడి ఉన్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించటం పై హర్షం వ్యక్తం చేశారు.