WGL: అత్తింటి వేధింపులు భరించలేక వరంగల్ లోతుకుంటకు చెందిన తూడి సునీల్ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇంతేజార్ గంజ్ పీఎస్ సీఐ షుకూర్ తెలిపారు. మిషన్ భగీరథ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సునీల్‌కు ఏడేళ్ల క్రితం దివ్యతో వివాహం కాగా, వారికి ఆరేళ్ల కూతురు ఉంది. సునీల్ తల్లి తూడి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.